తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కష్టాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం, అధికారులు ప్రత్యేకంగా గుర్తించి పరిష్కరించాలని టీడీపీ నాయకులు యు. విజయకుమార్ కోరారు. కార్మికుల కుటుంబాలను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు.“లోడు నింపితేనే కడుపు నిండుతుంది” అనే పరిస్థితుల్లో అనేక మంది కార్మికులు కుటుంబాలను పోషించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. రైతులు, కార్మికులు కష్టపడితేనే రాష్ట్రానికి, దేశానికి ఆదాయం సమకూరుతుందని అన్నారు.

అయితే కష్టపడుతున్న కార్మికులకు సరైన భద్రత, ఆరోగ్యం, విద్య వంటి మౌలిక సదుపాయాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య, కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కార్మిక కుటుంబాల్లో ఆనందం నిండాలంటే వారి సమస్యలను గుర్తించి ప్రభుత్వం వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని యు. విజయకుమార్ కోరారు.