తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : చేవెళ్ల ముద్దుబిడ్డ, రంగారెడ్డి జిల్లాకు వెన్నెముకగా నిలిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ, విద్యాశాఖ మంత్రి కీర్తిశేషులు పట్లోళ్ల ఇంద్రారెడ్డి 72వ జయంతి వేడుకలను రాజేంద్రనగర్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఐ.బి. ఫంక్షన్ హాల్ సమీపంలోని డైరీ ఫారమ్ వద్ద అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అత్తాపూర్, రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఇంద్రారెడ్డి అభిమానులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అత్తాపూర్, రాజేంద్రనగర్ సర్కిల్స్ అధ్యక్షుడు కోలన్ సుభాష్ రెడ్డి కోరారు.
