తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అంగన్ క మిలన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాటేదాన్ డివిజన్ బాబుల్ రెడ్డి నగర్‌లోని అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్ల సేవలను గుర్తించి మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, మహిళలకు అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు. సమాజంలో అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సేవలు ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు.

కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గోద పాండు యాదవ్, జిల్లా ఐటీ సెల్ ప్రతినిధి వెంకటరమణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు రావుల భాస్కర్, నవారు మురళీధర్ రెడ్డి, సంతోష్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, గోపాల్ నాయక్, రమేష్ రెడ్డి, కురుమయ్య, రాజస్వామి, రాంబాబు, కిషన్ నాయక్, వెంకటరమణ పాల్గొన్నారు..మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉడుత లక్ష్మి, అంజమ్మ, నాగమణి, లత, ప్రభావతి, అండాలు తదితరులు పాల్గొని అంగన్వాడీ టీచర్లను సన్మానించారు. అంగన్వాడీ టీచర్లు, బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.