తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: నంగునూర్
అనారోగ్యంతో బాధపడుతున్న తోటి ప్రజాప్రతినిధి కుటుంబానికి అండగా నిలిచి గట్లమల్యాల గ్రామ నాయకులు వంగ రాజేశ్వర్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు బత్తుల కనకయ్య గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఈ విషయాన్ని గ్రామ నాయకులు వంగ రాజేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు.కనకయ్య వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10,000/- (పది వేల రూపాయలు) ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.అదేవిధంగా, గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ప్రకాష్ రెడ్డి సైతం మానవత్వంతో స్పందించి, తన వంతుగా రూ.5,000/- ఆర్థిక సాయాన్ని అందించి బాధిత కుటుంబానికి భరోసానిచ్చారు. కష్టకాలంలో తమను ఆదుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డికి, ప్రకాష్ రెడ్డికి బత్తుల కనకయ్య కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గట్లమల్యాల మాజీ సర్పంచ్ తిప్పని రమేష్, మాజీ ఎంపీటీసీ ఓజల్, సంతోష్ నగర్ సర్పంచ్ సరోజినీ నాయక్, రంగు వెంకన్న, మంతూరి మల్లేశం, దండ్ల మల్లేశం, అమరేందర్, వెంకటయ్య తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
