తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో బాబుల్ రెడ్డి నగర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ మహేష్ హాజరై అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా మాజీ జి హెచ్ ఎం సి వార్డు మెంబర్ సోమ శ్రీనివాస్ మరియు రేషన్ డీలర్ సద్గుణ కాళిదాస్ మాట్లాడూతూ… ప్రభుత్వం పారదర్శకంగా, సులభంగా నిత్యావసర సరుకులు పొందేందుకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎ.టి. నాగరాజు, సురేష్, కోట పవన్, దుర్గాప్రసాద్, సందీప్, శ్రీకాంత్ రెడ్డి, ఎమ్. శ్రీనివాస్, జగ్గు, నవీన్ తదితర స్థానిక నాయకులు, పాల్గొన్నారు.