తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త మహబూబ్ పెట్ విలేజ్ పెద్దకుడి చెరువు కట్టపై రూ.70డెబ్బై లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణపనులను సీఎంసి అధికారులతో కలసి పరిశీలించిన మియాపూర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త మహబూబ్ పెట్ విలేజ్ పెద్దకుడి చెరువు కట్టపై రూ .70డెబ్బై లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మాణం చేపట్టినటువంటి సిసి రోడ్డు నిర్మాణం పనులను సీఎంసీ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించడం జరిగినదని, మక్త మహబూబ్ పెట్ విలేజ్ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని, సిసి రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని,మెరుగైన రవాణా సౌకర్యం కోసం శాయ శక్తులా కృషి చేస్తానని తెలిపారు, ప్రజలకు స్వచ్చమైన చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామన్నారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పీఏసీ చైర్మెన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో ఉమ్మడి మియాపూర్ డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, డివిజన్ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో సీఎంసీ ఎఈ నిఖిల్, స్థానిక నాయకులు మాధవరం గోపాల్ రావు, చందు యాదవ్, సతీష్, వర్క్ ఇన్స్పెక్టర్లు జగదీష్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.