తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హైదరాబాద్: ఓట్ల సవరణ ప్రక్రియలో ఎస్ఐఆర్ లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ,ఇండియా కూటమి ఇచ్చిన సేవ్ డెమోక్రసీ పిలుపులో భాగంగా నిర్వహించిన చలో లోక్ భవన్ (రాజ్ భవన్) కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బండి రమేష్ పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ గళాన్ని వినిపించారని బండి రమేష్ పేర్కొన్నారు. ఎస్ ఐ ఆర్ పేరుతో ఓట్ల సవరణ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు, ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని బండి రమేష్ స్పష్టం చేశారు. ప్రజల ఓటు హక్కును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బ్లాక్ డివిజన్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్, సేవాదళ్, మహిళా కాంగ్రెస్, ఎన్ ఎస్ యు , అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలకు బండి రమేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టే ప్రతి పోరాటంలో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలని బండి రమేష్ పిలుపునిచ్చారు.