తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఓటర్ల సవరణ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలను నిరసిస్తూ, ప్రజల ఓటు హక్కును పరిరక్షించాలనే డిమాండ్‌తో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , మంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు చలో లోక్ భవన్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్. లోక్ భవన్ వద్ద నిరసన చేపట్టిన మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు, అరెస్టులతో ప్రజల గొంతును అణచివేయలేరు. ప్రజల ఓటు హక్కు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు పూర్తి విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది. ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకమైన ప్రక్రియను నిర్వహించాలి. ఈ అంశంపై సమాధానం చెప్పాల్సిన సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ , కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ , ఇండియా కూటమి ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయడం అప్రజాస్వామిక చర్య. ప్రధాని నరేంద్ర మోడీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ పరిణామాలకు బాధ్యత వహించి రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కే ప్రజల అసలైన బలం. ఆ ఓటును కాపాడే వరకు మా పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు మన్నేపల్లి సాంబశివరావు, కవూరి ప్రసాద్, రామకృష్ణ, కృష్ణగౌడ్, దొడ్ల సాంబశివరావు, రామచంద్రగౌడ్, రవిగౌడ్, వాసు, ప్రభాకర్, రమాదేవి, మాధవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు