తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో మాన్యవర్ సాహెబ్ కాన్షీరాం వర్ధంతి సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ​ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గ నాయకుడు పూజారి ప్రవీణ్ మాట్లాడుతూ.. బహుజనుల హక్కుల సాధన, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల రాజకీయ చైతన్యం కోసం కాన్షీరాం చేసిన కృషి చిరస్మ రణీయమని కొనియాడారు.

ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమాన అవకాశాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కాన్షీరాం ఆశయాలను భావితరాలకు అందించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు నీరుడు సుర్వేష్ ముదిరాజ్, శ్రీకాంత్ ముదిరాజ్, కుమార్ సాయి యాదవ్, లింగారెడ్డి, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.