తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్: నియోజకవర్గ పరిధిలోని భవాని కాలనీ, ప్రేమావతిపేటలో రూ. 2.51 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు.డివిజన్ నంబర్ 120, సర్కిల్ 19 పరిధిలోని పలు అంతర్గత వీధుల్లో ఈ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. స్థానిక ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తొలగించి, మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
