తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సద్దుల బతుకమ్మ, దేవీ నవరాత్రుల సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలకు నవ యువ యూత్ క్లబ్ అధ్యక్షుడు ఏర్వ కుమారస్వామి శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా, మహిళల ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు నిలుస్తుందని అన్నారు. దేవీ నవరాత్రులు భక్తిభావం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ప్రజలు పండుగలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐకమత్యం నెలకొనాలని ఆకాంక్షించారు.
