తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, ఆదర్శనగర్ కాలనీలోని మాజీ కౌన్సిలర్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ స్వయంగా ప్రతి సంవత్సరం దసరా పర్వదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక పాత్రికేయులకు గౌరవప్రదంగా తీపి గుర్తుల కానుకలను అందజేసే సత్కార్యక్రమంలో బాగంగా ఈ సంవత్సర దసరా పర్వదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక పాత్రికేయులైన కొండా శ్రీనివాసుకు గౌరవప్రదంగా తీపి గుర్తుల కానుకలను తాడిబోయిన రామస్వామి యాదవ్ స్వయంగా అందజేసారు. ఈ శుభ సందర్బంగ పాత్రికేయులైన కొండా శ్రీనివాసు మాట్లాడుతు, పత్రికారచయితల విలువలను గుర్తించే పెద్దమనసు కలిగిన మహానుభావులు చాలా అరుదుగా ఉంటారని, సమాజానికి పాత్రికేయులందించే సేవలను గుర్తించగలిగే మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వారిలో తాడిబోయిన రామస్వామి యాదవ్ ఒకరని కొనియాడారు. పాత్రికేయులందరి తరఫున దసరా పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని తాడిబోయిన రామస్వామి యాదవ్ కు ఆ అమ్మవారి ఆశీస్సులతో సుఖసంతోషాలు ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.