తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శంషిగూడ డివిజన్ పరిధిలోని దత్తాత్రేయ కాలనీ ఫేస్2లోని శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవాలయంలో దసరా నవ రాత్రుల శుభసందర్భంగా నిర్వహించిన అమ్మవారి ప్రత్యేక పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి అల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం, ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని వెంకటేష్ గౌడ్ వారి చేతుల మీదుగా ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ అందరికి బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సీహెచ్. భాస్కర్, పోశెట్టిగౌడ్, కాశినాథ్ యాదవ్, భాస్కర్, వెంకటేష్, హరీష్, సిద్దయ్యా, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, శ్రీను, రాజు, శ్రీధర్, శ్రీనివాస్, కాలనీవాసులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
