తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: మియాపూర్ ఎఫ్సీఐ కాలనీ పార్క్లో ఎఫ్సీఐ కాలనీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు డా. యలమంచి ఉదయ్ కిరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. యలమంచి ఉదయ్ కిరణ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జగన్మాత దుర్గాదేవి ఆశీస్సులు పొందారు. అనంతరం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో భాగంగా ఎఫ్సీఐ కాలనీ ఉత్సవ కమిటీ సభ్యులు చంద్ర మౌళి, ఆనంద్, మహేందర్ తదితరులు డా. యలమంచి ఉదయ్ కిరణ్ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయుడు, నాగిరెడ్డి, గంగాధర్, సంజయ్, శరత్, కామినేని వాసు, వంశీ, నాని, అశోక్, ప్రవీణ్, రాజశేఖర్, రత్నాచారి, వినోద్, శశి తదితరులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి వెల్లివిరియాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
