తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ప్రశాంత్ నగర్ కాలనీ నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న అడ్వకేట్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ఎన్ఎన్ రెడ్డి టెక్స్టైల్ ప్రొప్రైటర్ కుశాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రశాంత్ నగర్ కాలనీ అభివృద్ధి కోసం కాలనీలో నెలకొన్న సమస్యలు కోసం ప్రతినిత్యం చేస్తున్నటువంటి దాసోజీ శ్రీనివాస్ కు అభినందనలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవష్యత్తులో వారు ఉన్నత పదవులను అధిరోహించాలని ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలి భగవంతుని వేడుకున్నారు. కార్యక్రమంలో పటాన్చెరువు బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చంద్రశేఖర్ రెడ్డి, నేతాజీ నగర్ కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, మూలాన, చంద్రశేఖర్, అశోక్, సంతోష్ , అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.