తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్, నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతంలో ఉన్న నర్సబాయి కుంట పరిసరాల్లో హైడ్రా ఆధ్వర్యంలో శుభ్రత పనులు చేపట్టారు. కుంట చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలు, పేరుకుపోయిన చెట్ల కొమ్మలను సిబ్బంది తొలగించారు.కార్మికులు, యంత్రాల సహాయంతో కుంట పరిసరాలను శుభ్రం చేస్తూ పరిశుభ్రత పనులను కొనసాగించారు. కుంటల పరిరక్షణతో పాటు వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణాన్ని కాపాడటం లక్ష్యంగా ఈ పనులు చేపట్టారు.జలవనరుల పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, కుంటల్లో చెత్తాచెదారం వేయకుండా పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని సూచిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యం, అధికారుల నిరంతర పర్యవేక్షణతోనే కుంటలను పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించవచ్చని పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

You missed