తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్వతాల రాజేందర్ ప్రకటించారు. ఓటర్ల పేర్లను తొలగించడం, ఓటర్ల జాబితాల్లో తారుమారు చేయడం భారత ప్రజాస్వామ్యానికి పునాదులైన ఎన్నికల వ్యవస్థపై నేరుగా దాడి చేయడమేనని ఆయన విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారంలో ఉన్న బీజేపీ చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వీధుల నుంచి న్యాయస్థానాల వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని పర్వతాల రాజేందర్ డిమాండ్ చేశారు.
