న్యూస్ డెస్క్ : మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ప్రచార రథాన్ని ప్రారంభించారు.అనంతరం సిటీ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు,వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి దిశగా ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం అపారమని పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో సభకు తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రచార రథం ద్వారా ప్రతి ఇంటికి చేరుకుని సభ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్ధం నరేష్,సీనియర్ నాయకులు రత్నం సతీష్ షా, సముద్రాల పరమేశ్వర్,బైరి మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు కందిమల్ల మహేష్,రఘునా రెడ్డి,గడల కుమార్,మండల అధ్యక్షుడు అపురూప సాయి,ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మార్టిన్ లూథర్,సీనియర్ నాయకుడు మాదాసు రాజు,స్థానిక బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.