న్యూస్ డెస్క్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్ర శివారులోని కోనారెడ్డి చెరువు కట్టపై నూతనంగా నిర్మించిన కట్ట మైసమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవాలయ నిర్వాహకులు ఈగ మల్లేశంను సాదరంగా ఆహ్వానించి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.
ఈ సందర్భంగా ఈగ మల్లేశం మాట్లాడుతూ కట్ట మైసమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించిన నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, కౌన్సిలర్ సిలివేరు కుమారస్వామి, తుమ్మల యాకయ్య, అబ్బు ప్రకాష్ రెడ్డి, మార్త సారంగపాణి, పూజారి రఘు, కోనాపురం యాకయ్య, తుమ్మల రవీందర్, సమ్మెట శ్రీనివాస్, నందిపాక భాస్కర్, వేణు, పాలకుర్తి శ్రీకాంత్, కోనాపురం ముత్తయ్య తదితర ప్రముఖులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
