న్యూస్ డెస్క్ : వరంగల్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ రాంపెల్లి లింగమూర్తి జాతీయ స్థాయిలో నిర్వహించిన “పద్మశ్రీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు – 2026” అందుకోవడంతో ఆయనకు పలువురు చేనేత, పద్మశాలి సంఘాల నాయకులు ఘన సన్మానం నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి సుధాకర్ ఆధ్వర్యంలో లింగమూర్తికి శాలువా కప్పి అభినందనలు తెలిపారు. జర్నలిజం రంగంలో ఆయన చేస్తున్న సేవలు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు.

సన్మానం చేస్తున్న దాసరి సుధాకర్, మంత్రి కమలాకర్, పద్మశాలి నేతలు

అలాగే రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మంత్రి కమలాకర్ నేత, వరంగల్ ఉర్సు పద్మశాలి సంఘం నాయకులు గుడిమల్ల రాజు, కందగట్ల వెంకటేశ్వర్లు, జడల శ్రీరామ్ మూర్తి, జడల శ్రీనివాస్, దాసరి రాము తదితరులు లింగమూర్తిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పద్మశాలి కుల బంధువులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాంపెల్లి లింగమూర్తి మాట్లాడుతూ తనకు లభించిన ఈ గౌరవం మరింత బాధ్యతను పెంచిందని, సమాజ సమస్యలను ప్రజల ముందుకు తీసుకువెళ్లే దిశగా మరింత కృషి చేస్తానని తెలిపారు.