తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: పద్మశాలి సంఘం ఎల్.బి. నగర్ సర్కిల్ ఆధ్వర్యంలో నవంబర్ 1న నిర్వహించనున్న 24వ పద్మశాలి దసరా మేళా గోడపత్రికను ఎమ్మెల్సీ ఎల్. రమణ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేళా నిర్వాహకులు, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్. రమణ మాట్లాడుతూ.. పద్మశాలి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించుకోవడానికి, సమాజ అభ్యున్నతికి అవసరమైన అంశాలపై ఆలోచనలు పంచుకోవడానికి దసరా మేళా మంచి వేదికగా నిలుస్తుందని అన్నారు. భారీ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

పద్మశాలీయుల ఆత్మీయ సమ్మేళనంగా దసరా మేళా: పద్మశాలి సంఘం ఎల్.బి. నగర్ సర్కిల్ అధ్యక్షుడు పున్న గణేష్ నేత మాట్లాడుతూ.. పద్మశాలి సమాజ ప్రయోజనాలే లక్ష్యంగా గత 23 సంవత్సరాలుగా ఎల్.బి. నగర్‌లో ఈ మేళాను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పద్మశాలీలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొంటుండటంతో ఈ కార్యక్రమం రాష్ట్రస్థాయి ఆత్మీయ సమ్మేళనంగా, పద్మశాలి సమాజ పండుగగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు.

వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న కులబాంధవులు ఒకరినొకరు కలుసుకోవడంతో పాటు, కొత్త పరిచయాలు ఏర్పరచుకోవడానికి ఈ మేళా ఎంతగానో దోహదపడుతుందని ఆయన వివరించారు.

మేళాలో ప్రత్యేక కార్యక్రమాలు: 24వ పద్మశాలి దసరా మేళా చైర్మన్ కౌకుంట్ల రవి తేజ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ఆటోనగర్ హరిణ వనస్థలి (అనన్య ఎకోపార్క్) ప్రాంగణంలో ఈ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు.

మేళాలో ప్రముఖుల సందేశాలు, సన్మాన కార్యక్రమాలు, మహిళలు, చిన్నారులకు క్రీడలు, ఉచిత వైద్య శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివాహ పరిచయ వేదికలు, దాండియా తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సందర్శకులకు రుచికరమైన, శుభ్రమైన భోజన సదుపాయం కూడా కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పద్మశాలీయులందరూ కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి మేళాను విజయవంతం చేయాలని కోరారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు: కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గుర్రం శ్రావణ్, ఎల్.బి. నగర్ సర్కిల్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు తలాటి రమేష్, జెల్ల సూర్యకాంత్, పడాల రవీందర్, జెల్ల జగన్నాథం, కోశాధికారి గుర్రం విశ్వేశ్వర్ రావు, కార్యదర్శులు చెరిపల్లి ప్రభాకర్, పొట్టబతిని నగేష్, చిటిపోలు శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మాకం గోపాల్, మహిళా అధ్యక్షురాలు రమాదేవి, కార్యదర్శులు పేరాల సుజాత, బోడ నిర్మల, యువత అధ్యక్షుడు కర్నాటి విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Avatar photo

By Murthy