న్యూస్ డెస్క్ : తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ములుగు జిల్లా పద్మశాలి సంఘం నూతన జిల్లా కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్త మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 33 జిల్లాల పర్యటనలో భాగంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ములుగు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన చిప్ప అశోక్ తో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్త మురళి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంఘ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొప్పెరి వెంకట హరిహర కిషన్, ములుగు జిల్లా గౌరవ అధ్యక్షులు డీపీ జనార్ధన్, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి మేకల జనార్దన్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు క్యాతం కిషోర్, ప్రధాన కార్యదర్శి భీమనపల్లి సత్యనారాయణ, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ పాల్గొన్నారు.
అలాగే ములుగు జిల్లా పరిధిలోని వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంఘ ఐక్యతతో పద్మశాలి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
