తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 23: శేరిలింగంపల్లికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన వ్యక్తిత్వం, ప్రజాసేవను రాజకీయాల కంటే గొప్ప బాధ్యతగా భావించే నాయకత్వం, ప్రజాసేవనే పరమావధిగా భావించి, నిత్యం ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో కృషి చేస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు, శేరిలింగంపల్లి టైగర్, ఐకానిక్ పర్సనాలిటీ, విద్యావంతులు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ వి.జగదీశ్వర్ గౌడ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 24వ తేదీ ఉదయం 11:30గం.లకు మానవ సేవే మాధవ సేవ అనే మహోన్నత స్ఫూర్తితో అన్నదానం పరమోన్నత దానంగా మియాపూర్ లోని వివేకానంద సేవ ఆశ్రమంలో అన్నదాన మహా సేవ మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పుణ్యకార్యక్రమానికి శ్రేయోభిలాషులందరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందగా మియాపూర్ యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్, యలమంచి ఉదయ్ కిరణ్ ఆహ్వానిస్తున్నారు.