తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శక్తి స్వరూపిణి లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రతి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకున్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో, ఐకమత్యంతో, సౌభాగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. బోనాల పండుగను సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో, సామరస్యపూర్వక వాతావరణంలో జరుపుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు.
