తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని భావన ఋషి నగర్‌లో శ్రీ మార్కండేయ ట్రస్ట్ భవనంలో తెలంగాణ పద్మశాలి సంఘం జాయింట్ సెక్రటరీ కాశీగారి యాదగిరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు, నాయకులు, సభ్యులు, స్థానికులు కాశీగారి యాదగిరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేయించి వేడుకలను ఆనందంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాశీగారి యాదగిరి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి సంఘం నాయకులు, సభ్యులు, శ్రీ మార్కండేయ ట్రస్ట్ ప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.