తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ ఫౌండర్ మరియు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు మల్లెల జయ నేతృత్వంలో దేశభక్తి, ఐక్యత, జాతీయ గౌరవాన్ని ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించిన వేడుకలకు ముఖ్యఅతిథిగా టీపిసిసి జనరల్ సెక్రటరీ మరియు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ జెండాకు వందనం చేసి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అనంతరం, మల్లెల జయ స్వయంగా విద్యార్థులకు, కాలనీవాసులకు, పేదవారికి చాక్లెట్లు, స్వీట్స్ తో పాటుగా అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్బంగ మల్లెల జయ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం మన హక్కు, దేశం పట్ల మన బాధ్యతను గుర్తుచేసే పవిత్రమైన సంకల్పం అని అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశ ఐక్యతను కాపాడుతూ ప్రజాసేవను లక్ష్యంగా చేసుకుంటూ అభివృద్ధి చెందిన, బలమైన భారతదేశ నిర్మాణంలో మన వంతు పాత్ర పోషిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, విద్యార్థులు, యువ నాయకులు, స్థానిక కాలనీవాసులు, అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటుతూ వేడుకలను విజయవంతం చేశారు.