రైతుల సౌకర్యార్థం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాట్లు 7995050789

ప్రస్తుత వాతావరణ మార్పుల దృశ్య రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉండాలి

మరిపెడ, దంతాలపల్లి, తొర్రూరు, పెద్దవంగర మండలా ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణపై విస్తృతంగా పర్యటించిన: అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్

న్యూస్ డెస్క్ : జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణలో సహకార శాఖ, ఐకెపి, గిరిజన కార్పొరేషన్, మెప్మా, తదితర శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, టార్పాలిన్స్, గన్ని సంచులు, మ్యాచ్చర్ మిషన్లు, ప్యాడి క్లీనర్స్, రవాణా చేయుటకు వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని, అన్ని శాఖల సమన్వయంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ కె.అనిల్ కుమార్, సంబంధిత అధికారులను కేంద్రాల నిర్వహకులను ఆదేశించారు,

ప్రభుత్వ సూచనలు,జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, గారి ఆదేశాల మేరకు మంగళవారం మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం, తండ ధర్మారం, అబ్బాయిపాలెం, హేమ దుర్గా రైస్ మిల్లును, దంతాలపల్లి మండలం బిరి శెట్టి గూడెం, పెద్ద వంగర మండలం చిట్యాల గ్రామాలలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు,

కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వ సూచనల మేరకు ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని, అందుకు సంబంధించి రైతు వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి డబ్బులు త్వరగా పడే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు,
ప్రస్తుత వాతావరణం మార్పుల చేర్పుల నేపథ్యంలో కేంద్రాల వద్ద నిలువ ఉన్న ధాన్యం వర్షంలో తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని వాతావరణ మార్పుల వివరాలను రైతులకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలని తెలిపారు,
లారీ కాంట్రాక్టర్స్, హమాలీలు,రవాణా చేయు సందర్భంలో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు,
ఎక్కడైనా కేంద్రాల నిర్వహణపై అవకతవకలు, అక్రమాలు జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అదనపు కలెక్టర్ తెలిపారు,
రైతుల సౌకర్యార్థం ధాన్యం కేంద్రాల నిర్వహణ రవాణా తదితర సందర్భాలలో ఏదైనా సమస్యలు ఏర్పడితే వెంటనే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నెంబర్ *7995050789* కు సమాచారం అందించాలని కోరారు,

అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రమేష్, సివిల్ సప్లై మేనేజర్ నరసింహారావు తహసీల్దారులు కృష్ణవేణి, శ్రీనివాస్, వినోద్, సునీల్ రెడ్డి, సెంటర్ నిర్వాహకులు తదితరులు ఉన్నారు.