న్యూస్ డెస్క్ : మహబూబాబాద్ జిల్లా బాల్యం లో వివాహం అనర్దాలకు మూలం అని జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్ అన్నారు మంగళవారం గూడూరు మండలం అయోధ్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఏర్పాటు చేసిన ఆశా డే కార్యక్రమానికి ముఖ్య అతిదిగా పాల్గొని మాట్లాడుతూ

భారతదేశంలో వివాహానికి సరైన వయసు అమ్మాయిలకు 18 సంవత్సరాలు అబ్బాయిలకు 21 సంవత్సరాలు అని బాల్య వివాహాలను నివారించడానికి లింగ సమానతను ప్రోత్సహించడానికి వీలు గా ఉంటుందని సరైన వయసులో వివాహానికి అనేక లాభాలు వున్నాయని ముఖ్యంగా చిన్నపిల్లల వివాహాలను నిషేధించడం ద్వారా చట్టం ద్వారా మౌలిక హక్కులను గుర్తిస్తుందని బాల్య వివాహాల వల్ల వచ్చే శారీరక భావోద్వేగ మానసిక ఒత్తిడిలను నివారిస్తుందని ఆయన తెలిపారు అంతేకాకుండా వివాహ వయసును ఆలస్యం చేయడం వలన అమ్మాయి శారీరక ద్రుడత్వం పెరిగి సరైన వయస్సు లో గర్భ దారణ పొందవచ్చని తన విద్యను కొనసాగించడానికి వ్యక్తిగత వృత్తిపరమైన అభివృద్ధికి కొంత మౌలిక నైపుణ్యాలను పొందడానికి అవకాశం ఇస్తుందని ఇది వారిని శక్తివంతులుగా మార్చుతుందని అది సమాజానికి తోడ్పడుతుందని బాల్య వివాహాలు అమ్మాయిలకు ప్రతికూల ఆరోగ్యాన్ని కలిగిస్తాయని మాతృ మరణ రేట్లు పెరగడం బాల్య గర్భధారణలను తగ్గించడం ద్వారా మెరుగైన ఆరోగ్య ఫలితాలను ప్రోత్సహిస్తుందని సరైన వయసులో పెళ్లి చేసుకుంటే అమ్మాయి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుందని సంబంధాలను అర్థం చేసుకుని బాధ్యతగా ముందుకు సాగుతుందని జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో జీవిత నిర్ణయాలలో స్పష్టత ఉంటుందని ఆయన తెలిపారు అలాగే మహిళలను సామాజిక ఆర్థిక రాజకీయ జీవితంలో సంపూర్ణంగా పాల్గొనడానికి వీలు కల్పించడం ద్వారా సాధికారతను కల్పిస్తుందని ఇది వారికి జీవిత నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఉన్నత విద్యను అభ్యసించడానికి తోడ్పడుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమం లో ఆరోగ్య విద్యా బోదకుడు పురుషోత్తమ్ ఎం‌పి‌హెచ్‌ఈ‌ఓలు కే‌ఎల్‌ఎన్ స్వామి గోపిచంద్ పి‌హెచ్‌ఎన్ మేరి సుపెర్వైజర్స్ ఫహీముద్దీన్ గణేశ్, హేమలత ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.