పలుగుగడ్డ అమ్మవారి దర్శనం చేసుకున్న కవిత
న్యూస్ డెస్క్ : తెలంగాణ ప్రజల హక్కులు, భద్రత కాపాడటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పలుగుగడ్డ అమ్మవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె పలు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. పార్టీ స్థాపన అనంతరం గజ్వేల్‌లో గౌడ సమాజ పెద్దలతో కలిసి ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నామని, అలాగే పలుగుగడ్డలో ముదిరాజ్ సమాజంతో కలిసి పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

తెలంగాణ ప్రజలను అన్ని రంగాల్లో రక్షించేందుకు “తెలంగాణ రక్షణ సేన” పార్టీని స్థాపించామని పేర్కొన్న కవిత, తమ పార్టీలో ముదిరాజ్ సమాజానికి గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రజల ఆశీర్వాదం తమకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ, యువత, మహిళలు రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
