అకాల వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

న్యూస్ డెస్క్: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆలస్యం జరగకుండా టోకెన్ పద్ధతిని పక్కాగా అమలు చేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫిగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
బుధవారం నర్మేట్ట మండలం బొమ్మకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.
ఈసందర్బంగాకేంద్రనిర్వాహకులు రైతులకు కలెక్టర్ పలు సూచనలు ఇచ్చారు.టోకెన్ పద్ధతిని అమలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావని కాంటాను కరెక్ట్ చేసి వెనువెంటనే కొనుగోలైన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. లారీలు సమయానికి రాకపోతే తక్షణమే సమాచారం అందించాలన్నారు.
కొనుగోలు అయిన ధాన్యాన్ని మిల్లులకు తరలించని వెహికిల్ యాజమాన్యంపైన తప్పకుండ చర్యలు ఉంటాయన్నారు. కేంద్ర నిర్వాహకులు కొనుగోలుకు సంబందించిన అన్నీ రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని సరిపడా గన్ని బ్యాగ్లను అందుబాటులో పెట్టుకోవాలన్నారు. ఓపిఎంఎస్లో కూడా త్వరగా కొనుగోలు అయిన ధాన్యం వివరాలను అప్లోడ్ చేయాలన్నారు. అనంతరం రైతుల తో కలెక్టర్ మాట్లాడి కొనుగోలు ప్రక్రియపైన వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లను కప్పి పెట్టుకోవాలని కలెక్టర్ వారికి సూచించారు.