తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన బడా గణేష్ స్వామివారిని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గుర్రం శ్రావణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పద్మశాలి యువజన సంఘం ఎల్.బి.నగర్ సర్కిల్ అధ్యక్షులు కర్నాటి విజయ్ నేత, కిషోర్ తదితరులు గణనాథుడిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు పొంది, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు గుర్రం శ్రావణ్ కుమార్ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
