తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్ గణేష్ మండపం వద్ద గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మార్కండేయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, నవోదయ యూత్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నదాన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, స్థానికులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఏర్వసత్యనారాయణ, గద్దె కృష్ణ, కోట జగదీష్, పగిడిమర్రి సూర్యనారాయణ, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వీడం రమేష్, ప్రధాన కార్యదర్శి కోట శ్యామ్ కుమార్, మామిడి శెట్టి శ్రీనివాస్, పిసికే భాస్కర్, ముషం నరేష్, కర్నాటి శ్రీనివాస్, చంద్రయ్య, అలాగే నవోదయ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు కోట పవన్ కుమార్, ఉడుత సురేష్, యాదగిరి భాస్కర్, రావుల నవీన్, గుత్తి మల్లేష్, ఏ. సురేష్‌లతో పాటు కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఎన్. ధనంజయ, సరికొండ వెంకటేష్, టి. ప్రేమ్ గౌడ్, కళ్లెం లక్ష్మారెడ్డి, యంజాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
