తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: రామచంద్రాపురం, కానుకుంటలో వినాయక చవితి పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఆర్కే లక్ష్మి, రామకృష్ణ, రాజు, శ్రీనివాస్, సాయిరాం, నరోత్తం రెడ్డి, మహేందర్ రెడ్డి, అరవింద్, రత్నం, సాయినాథ్, శివ, మహేందర్, శ్రీనివాస్, అరవింద్, రత్నం నేతృత్వంలో జీవ కాంతులతో విరాజిల్లుతున్న గణనాధుని సుందరమైన మండపంలో ప్రతిష్టించి వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, అత్యంత వైభవోపేతంగా గణనాధుని సన్నిధిలో ఏర్పాటుచేసిన అన్న ప్రసాదాలను భక్త జనులకు అందజేశారు. ఈ సందర్భంగా భక్త జనులు మాట్లాడుతూ, గణనాధుని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలుచేసి గణనాధుని సన్నిధిలోని అన్న ప్రసాదాలను స్వీకరించే అదృష్టాన్ని కలుగజేసినందుకు నిర్వాహకులకు, సహకరించిన వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి ఆ గణనాథుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వేడుకుంటున్నట్లుగా తెలియజేశారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు మాట్లాడుతు, ఆ గణనాధుని ప్రతిష్టించిన సమయం నుండి ప్రతినిత్యం శాస్త్ర యుక్తంగా ఆ గణనాధుని సన్నిధిలో పూజలందుకున్న అన్న ప్రసాదాలను భక్త జనులకు అందించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ ప్రజలందరి మీద ఆ గణనాధుని కృపాకటాక్షాలు ఉండాలని ప్రార్థించినట్లుగా తెలియజేశారు.
