తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, ఆమనగల్లు: స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి, తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆమనగల్లు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. ఆయన ఆశయాలు, తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు. బాపూజీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్, ఆమనగల్లు మండల తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకుడు అవ్వారి శివలింగం, మున్సిపాలిటీ మాజీ వైస్ ప్రెసిడెంట్ భీమనపల్లి దుర్గయ్య, గుజ్జరి శ్రీనివాస్, గుజ్జరి తిరుపతయ్య, చిలువేరు వాసుదేవ్, చెరుకు రవి, వారి పాండు, భావనల శంకర్, అవ్వారి శ్రీశైలం, గౌడ సంఘం అధ్యక్షుడు, మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుడు చుక్క అల్లాజి, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు, చేనేత సంఘాల ప్రతినిధులు, కులబాంధవులు పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
