తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ చౌరస్తా వద్ద నుండి హౌసింగ్ బోర్డు వెళ్లే ఉషముల్లపూడి ప్రధాన రహదారీలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2నుండి శంషిగూడ వెళ్ళే హైటెన్షన్ రోడ్డు నాలుగు రోడ్ల కూడలివద్ద ఉదయం సాయంత్రం ప్రజలు డ్యూటీలకు వెళుతున్న సందర్భంలో భారీ ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో విషయం ప్రజలు ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన కార్పొరేటర్ విషయాన్ని శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ అరెకపూడి గాంధీతో బాలానగర్ ట్రాఫిక్ సిఐ శ్రీనివాసరావు తో చర్చించి, ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించాలని కోరారు. వెంటనే స్పందించిన బాలనగర్ సీఐ సిమెంట్ దిమ్మెలు ఏర్పాటుచేసి, యుటర్న్ మూసివేసి ట్రాఫిక్ సాఫీగా వెళ్లిపోయేందుకు సహకరించినందుకు ట్రాఫిక్ సిఐ శ్రీనివాసరావుకు దొడ్ల వెంకటేష్ గౌడ్ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, పోశెట్టి గౌడ్, లింగం, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
