తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : క్షయ వ్యాధి రహిత భారత్ కార్యక్రమం అమలుపై రాజేంద్రనగర్ జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మోహి సమీక్ష నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ స్వర్ణకుమారితో కలిసి జిల్లా స్థాయి వైద్యాధికారులు, పర్యవేక్ష కులతో సమావేశమయ్యారు. జిల్లాలో క్షయ వ్యాధి పరిస్థితి, గుర్తించిన కేసులు, చికిత్స పొందుతున్న వారి వివరాలు, వ్యాధి నియంత్రణకు చేపడుతున్న చర్యలపై అధికారులను అడిగి వివరాలు సేకరించారు. క్షయ వ్యాధి నిర్మూలనకు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు ఈ సమీక్ష సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పాపారావు, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు డాక్టర్ రాకేష్, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ సత్య, జిల్లా కార్యక్రమ నిర్వహణ అధికారి విల్సన్, విజయకుమార్, రహీం, నరేష్‌కుమార్, మధుబాబు తదితరులు పాల్గొన్నారు.