తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర ఏడో రోజుకు చేరుకుంది. పరిగి నుంచి వికారాబాద్ వైపు యాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు పాదయాత్ర 122 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

 

యాత్రలో భాగంగా మార్గమధ్యంలో పరిగి ప్రాథమిక పాఠశాలను సందర్శించిన తీన్మార్ మల్లన్న విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం అభిమానులు, స్థానిక ప్రజలను కలుసుకుంటూ ముందుకు సాగారు. పలువురు ఆయనతో కరచాలనం చేసి సెల్ఫీలు దిగారు.

ప్రజలతో మమేకమవుతూ కొనసాగుతున్న యాత్ర ప్రస్తుతం పరిగి నుంచి నస్కల్ వైపు సాగుతోంది. బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, రాజ్యాధికార లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో యాత్ర కొనసాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.