తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, చీరాల: చేనేత సమస్యల పరిష్కారం కోరుతూ చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్యను చేనేత సంఘాల ప్రతినిధులు మంగళవారం కలిశారు. ఏపీ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆదేశాల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాల చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ దామర్ల శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ప్రతినిధులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.

చేనేత సహకార సంఘాల సమస్యలు, కార్మికుల సమస్యలు, నేతన్న సేవ పథకం కింద అర్హత ఉన్నప్పటికీ ప్రయోజనం పొందని కార్మికుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో చీరాల నియోజకవర్గంలోని వివిధ చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు, చేనేత పెద్దలు, ట్రేడ్ యూనియన్ నాయకులు, శ్రేయోభిలాషులు కలిపి సుమారు 40 మంది పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య హామీ ఇచ్చారు. త్వరలో చేనేత కార్మికులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు.
