తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆరోగ్యమే మహాభాగ్యమనే లక్ష్యంతో రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్ బృందావన్ కాలనీలో శ్రీ బాల గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జయదేవ్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సంతోష్ గౌర్ పర్యవేక్షణలో నిర్వహించిన శిబిరంలో సుమారు 650 మందికి వివిధ వైద్య పరీక్షలు ఉచితంగా చేశారు.

కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గోదా పాండు యాదవ్, బాలరాజు యాదవ్, సత్యం యాదవ్, సుభాష్ బీరాధర్, సదానంద్, చెన్నప్ప, సంజయ్, పవన్ సేట్, మల్లికార్జున్, ఆదిరెడ్డి, శివ బీరాధర్ తదితరులు పాల్గొన్నారు.

థైరాయిడ్, గుండె విద్యుత్ పరీక్ష, రక్తపోటు, రక్తంలో చక్కెర తదితర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సూచనలు అందించారు. శిబిరాన్ని కాలనీవాసులు సద్వినియోగం చేసుకున్నారు.
