తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రగతి కాలనీలో ప్రగతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాల్లో భాగంగా లడ్డూ వేలం, లక్కీ కూపన్ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
లడ్డూ వేలంలో ఫ్రెండ్స్ గ్రూప్‌కు చెందిన 11 మంది సభ్యులు సంయుక్తంగా పాల్గొని రూ.2,01,000లకు లడ్డూను దక్కించుకున్నారు.

కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు అక్కెం కృష్ణ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు వేలంలో గెలుచుకున్న లడ్డూను ఫ్రెండ్స్ గ్రూప్‌కు, లక్కీ డ్రాలో గెలిచిన లడ్డూను నవారు శ్రీ బ్రహ్మిణి రెడ్డికి అందజేశారు. అదేవిధంగా రూ.100 లక్కీ కూపన్ డ్రా నిర్వహించగా నవారు శ్రీ బ్రహ్మిణి రెడ్డి విజేతగా నిలిచి మరో లడ్డూను గెలుచుకున్నారు. ఈ కార్యక్రమం లో గ్రూప్ సభ్యులు సమ్మిరెడ్డి శశిధర్ రెడ్డి, మైలిక కీర్తి యాదవ్, కట్టెగమ్ముల శ్రీనివాస్, నవారు మహేందర్ రెడ్డి, ముద్దం రంజీత్ రెడ్డి, అక్కెం రవీందర్ యాదవ్, పిశాటి నరేందర్ రెడ్డి, తుమ్మల నవీన్ రెడ్డి, మొగులపల్లి సిద్ధు రెడ్డి, గుర్రం సాయి కిరణ్ రెడ్డి, నవారు దీపక్ రెడ్డి పాల్గొన్నారు.