తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జంగమ్మెట్‌లోని జై దుర్గా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి పార్వతల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మహేష్, అశోక్, సదా మహిశంకర్, రఘు, ఉదయ్, వరించీ, మహేందర్, పి. సదా మహిశంకర్, శివ తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.