తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్ పల్లి డివిజన్ పద్మ శాలి పురం లోని జ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో దేశపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు, బస్తీ వాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ… దేశ స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలు ఎప్పటికీ ఆచరణీయమని కొనియాడారు. “జై జవాన్ – జై కిసాన్” నినాదంతో దేశాన్ని నడిపించిన లాల్ బహదూర్ శాస్త్రి క్రమశిక్షణ, నిరడంబరత నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. యువత ఈ మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ సమాజ సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రముఖులు, పద్మ జ్యోతి యువజన నాయకులు,స్థానికులు పాల్గొన్నారు.
