తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ ఎన్నికల సందర్భంగా హెచ్సీయు డిపోలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని అధ్యక్షులు, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించి, యూనియన్ నాయకులు, కార్మికులతో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని, కార్మికుల ఐక్యతే యూనియన్ బలమని తెలిపారు. అనంతరం, డిపోలో కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా కార్మికులకు, సిబ్బందికి ఆహారాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో డిపో ప్రెసిడెంట్ టి. మనోహర్, డిపో సెక్రటరీ వై.ఎస్. బసప్ప, తెలంగాణ ఆర్.టీ.సీ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి, చీఫ్ అడ్వైసర్ లు మహేష్ గౌడ్, ప్రసాద్, ట్రెజరర్ రవి కుమార్, కమిటీ మెంబర్స్ రవి, మల్లేశం, ఏం శ్రీశైలం, నర్సింలు, శ్రీశైలం, అనిల్ భీమయ్య తదితరులు పాల్గొన్నారు.