తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ సాయి రాం నగర్ కాలనీ వాసులు కాలనీలో గల పలు సమస్యలు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. దీనిపై తాజా మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ , శ్రీ సాయి రాం కాలనీ వాసులు, కాలనీలో గల పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై తమను కలవడం జరిగినదని, త్వరలోనే కాలనీలో స్వయంగా పర్యటించి, పరిశీలించి, విడతల వారిగా సమస్యలను పరిష్కరిస్తానని చెప్పడం జరిగినది, అలానే పలు కాలనీలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ ప్రత్యేక చొరవతో డివిజన్లో అత్యవసరం ఉన్నచోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తిచేస్తామని తాజా మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ తెలియచేశారు. ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, శ్రీ సాయి రాం నగర్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, నా ప్రథమ లక్ష్యం అని శ్రీకాంత్ పేర్కొన్నారు. అలానే అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని శ్రీకాంత్ పేర్కొన్నారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, అదే విధంగా ఉమ్మడి మియాపూర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి రాం నగర్ కాలనీ వాసులు మహమ్మద్ షా, భాస్కర్ రెడ్డి, నరేందర్ రెడ్డి సత్యనారాయణ, శామీర్, వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, నవీన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.