తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాంతివనం సమీపంలో 11వ తేది ఆదివారం నూతనంగా ఏర్పాటుచేసిన రామరాజ్ కాటన్ షోరూమ్‌ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం. రఘునాథ్ యాదవ్, సినీ, టీవీ నటుడు శ్రీరామ్, జబర్దస్త్ రాకేష్, శ్రీమతి జోర్దార్ సుజాత పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. రామరాజ్ కాటన్ వ్యవస్థాపకులు చైర్మన్ కెఆర్. నాగరాజన్ సభికులకు సాదర స్వాగతం పలికారు. ప్రారంభోత్సవం సందర్బంగ అలేటి రుక్మా రెడ్డి మొదటి కొనుగోలు చేసారు. అనంతరం, వారు మాట్లాడుతు, గౌరవనీయుల కోసం అనే నినాదంతో విక్రయించబడుతున్న రామ్‌రాజ్ కాటన్ దుస్తులు, అందం, ఉల్లాసాల అద్భుత కలయికగా నిలుస్తాయని రామ్‌రాజ్ వారి మృదువైన కాటన్ షర్టులు, ధోవతులను ధరించడం కళ్ళకు నిజమైన విందును ఇస్తుందని ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉండే రామ్‌రాజ్ కాటన్ ఉత్పత్తులు, సమాజంలో గౌరవాన్ని, హోదాను మర్యాదను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ తెల్లని వస్త్రాల విక్రయాలలో రామ్‌రాజ్ కాటన్ సంస్థ గణనీయమైన పురోగతిని సాధించిందని, సంప్రదాయం, సంస్కృతిని పరిరక్షించడానికి కట్టుబడి ఉన్న ఈ సంస్థ అన్ని ముఖ్యమైన ప్రాంతాలలో తన షోరూమ్‌లను ఏర్పాటుచేసిందని అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల కోసం ఆన్‌లైన్ విక్రయాలను కూడా ప్రారంభించిందని తన ఉత్పత్తులను శ్రీలంక, సింగపూర్, మలేషియా, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోందని తెలిపారు. రామరాజ్ కాటన్ సంస్థ తయారు చేసే ఉత్పత్తులన్నీ మృదువైన కాటన్ వస్త్రాలతో రూపొందించబడ్డాయని వస్త్ర రంగ నిపుణులచే తయారు చేయబడి, అమ్మబడునని ధోతీలు, షర్టులు, బనియన్లు దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఉత్తర భారతదేశంలో రాష్ట్రాల వెలుపల కూడా అమ్మబడునని దేశవ్యాప్తంగా ధోతీల అమ్మకాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఏకైక సంస్థ రామ్‌రాజ్ కాటన్ అనే విషయం అందరికీ బాగా తెలుసని రామ్‌రాజ్ కాటన్ షోరూమ్‌లలో ఫ్యాన్సీ బోర్డర్ ధోతీలు, స్టెయిన్ గార్డ్ ధోతీలు, సుగంధ ధోతీలు, ముడతలు పడని ధోతీలు, శుభ ముహూర్త ధోతీలు, ఎంబ్రాయిడరీ ధోతీలు, మయిల్కన్ ధోతీలు, పంచకచ్చా ధోతీలు, సిల్క్ ధోతీలు ,కాటన్ షర్టులు, ఎంబ్రాయిడరీ షర్టులు, ముడతలు పడని షర్టులు, కూల్ కాటన్ షర్టులు, శుభ ముహూర్త షర్టులు, అల్టిమేట్ షర్టులు, డిజైనర్ షర్టులు, సిల్క్ షర్టులు, లినెన్ షర్టులు, బోర్డర్ మ్యాచింగ్ షర్టులు, తెలుపు, పలురంగుల ఫేస్ మాస్క్‌లు లభిస్దాయని యువతను ఆకర్షించే వివిధ రంగులలో టీ- షర్టులు కూడా ఇక్కడ లభిస్తాయని ధోతీ అనేది దక్షిణ భారతదేశంలో ఒక సాంప్రదాయ వస్త్రధారణ, దీనిని రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులు ఎంతగానో ఇష్టపడతారని దీని వార్షిక వృద్ధి రేటు 25శాతం కంటే ఎక్కువగా ఉందని నాణ్యతలో రాజీ లేదు అనే కంపెనీ మంత్రమే దీనికి చోదక శక్తి. సాంప్రదాయ వస్త్రధారణ, ఆధునిక రూపం గల ధోతీలు క్రమంగా హుందాతనం, సున్నితత్వం, సొగసు, నిబ్బరానికి చిహ్నంగా మారుతున్నాయి. అలాగే జెన్‌ఎక్స్ట్, లిటిల్ స్టార్, షర్టులకు సరిపోయే ధోతీ బోర్డర్ వంటి వినూత్నమైన కొత్త ఉత్పత్తులు ధోతీలు ధరించే సుదీర్ఘ సంప్రదాయానికి మరింత వన్నె తెస్తున్నాయి. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ధోతీలకు విలువ జోడించడం యువతకు సరిపోయే వినూత్న పోకడలను ప్రవేశపెట్టడం వంటివి బ్రాండ్‌కు అన్ని విధాలుగా విజయాన్ని అందిస్తున్నాయని అలాగే దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలు, విమానాశ్రయాలలో షోరూమ్‌లు ప్రారంభమవుతున్నాయిని ప్రత్యేకమైన తెలుపు రంగు వస్త్రాల కోసం ఎయిర్ కండిషన్ చేయబడిన రామ్‌రాజ్ కాటన్ స్పెషల్ షోరూమ్‌కు వినియోగదారుల నుండి గొప్ప మద్దతు లభిస్తోంది. రామ్‌రాజ్ కాటన్ వారి ధోతీ, షర్ట్ , బనియన్లు షోరూములలోనే కాకుండా ప్రముఖ టెక్స్‌టైల్ షోరూమ్‌లలో కూడా లభిస్తాయని ప్రతిరోజూ ఉల్లాసకరమైన అనుభూతి కోసం రామ్‌రాజ్ కాటన్ తెల్లని వస్త్రాలను ధరించండని తెలియచేస్తూ, వినియోగదారులందరికీ రామ్‌రాజ్ కాటన్ సంస్థ వారు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసారు.