తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాటేదాన్‌లోని టీ.ఎన్.జీ.ఓస్ కాలనీలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ. ప్రకాష్ గౌడ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.జగన్మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు సోమ శ్రీనివాస్ గుప్తా, సిరంగి బుచ్చయ్య, అర్థం లక్ష్మయ్య గుప్తా, వీరబొమ్మ సురేష్ గుప్తా, కొండా కృష్ణయ్య గుప్తా, అర్థం శ్రీనివాసులు గుప్తా, కలకొండ రామలింగయ్య గుప్తా, సంఘం అధ్యక్షుడు చెవ్వ రవీందర్ గుప్తా, రంగప్రభాకర్ గుప్తా, వీరబొమ్మ లింగయ్య గుప్తా, సరాబు అనంతం గుప్తా, ప్రేమ్ గౌడ్, సరికొండ వెంకటేష్, బాస శ్రీను, లక్ష్మారెడ్డి, సోమ అశోక్, పోలిశెట్టి ఉపేందర్, గుడిపల్లి శేఖర్, పానుగంటి శేఖర్ గుప్తా, నేలంటి నర్సింహ గుప్తా, సోమ సందీప్, వనమాల సురేష్, చిగుళ్లపల్లి సత్యనారాయణ గుప్తా, కొబాజి అనిల్ గుప్తా, ఓరుగంటి సత్యనారాయణ గుప్తా, కుంచం పాండు, జూలూరి సంపత్ కుమార్ గుప్తా, గుడిపల్లి రవీందర్ గుప్తా, యల్ల బాలరాజు గుప్తా, కుంచకూరి పుల్లయ్య గుప్తా, రాచూరి రాము గుప్తా తదితరులతో పాటు గణేష్ నగర్, టీ.ఎన్.జీ.ఓస్ కాలనీ వాసులు పాల్గొన్నారు.
