స్వాగతం పలికిన చేనేత ఐక్య వేదిక సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండేటి రమేశ్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ మహాశక్తి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 11న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆలయానికి విచ్చేసిన తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ చేనేత ఐక్య వేదిక సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండేటి రమేశ్ రాపోలు వీర మోహన్‌కు సాదర స్వాగతం పలికి, అమ్మవార్ల దర్శనానికి తోడ్కొని వెళ్లారు. అనంతరం ఆలయంలో గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రాపోలు వీర మోహన్‌కు అమ్మవారి శేషవస్త్రాన్ని బహూకరించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో చేనేత ఐక్య వేదిక మహిళా విభాగం నాయకురాలు శ్రీమతి రాజేశ్వరి పాల్గొన్నారు.
