ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పద్మశాలిపురం వార్డు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని నాయకులు పేర్కొన్నారు. డిజిటల్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాటేదాన్–మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్. ధనుంజయ, టీ. ప్రేమ్ గౌడ్, బొల్లా వెంకటేష్, పల్నాటి ఉదయ్ కుమార్, గంజి వెంకటేష్, రేషన్ డీలర్లు పి. శేఖర్, మసన సత్యనారాయణ, మూసిని జీవన మూర్తి, ఈ. సత్యనారాయణ, శరణమ్మ తదితరులు పాల్గొన్నారు.
