తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బాలాపూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు ఆరు రోజుల పాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ ప్రేమ్ దాస్ గౌడ్‌లను ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు వారికి ఆహ్వాన పత్రాలను అందజేశారు. పరాభవ నామ సంవత్సర అశ్వయుజ మాసం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ నిర్వాహకులు కోరారు.
