తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శివాజీ సేన సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రంగాధంపల్లి అంజి గౌడ్ (బొడిగే రామాంజన్ గౌడ్) నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇంతటి కీలకమైన బాధ్యతను అప్పగించిన శివాజీ సేన రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.తనకు అప్పగించిన ఈ బాధ్యతను అంకితభావంతో, నిబద్ధతతో మరియు పూర్తి నిజాయితీతో నిర్వర్తిస్తూ.. సంస్థ బలోపేతానికి, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
